Rashmika Mandanna: 2019 ట్రోల్స్ నన్ను ఏడ్పించాయ్.. పీడకలలా వెంటాడాయ్ : రష్మిక

తనను ఉలిక్కిపడి లేచేలా.. వెక్కివెక్కి ఏడ్చేలా చేసిన ఒక చేదు అనుభవం గురించి రష్మిక మందన చెప్పుకొచ్చింది. పీడకలలా వెంటాడిన ట్రోల్స్ గురించి వివరించింది. 2019లో విడుదలైన ‘డియర్‌ కామ్రెడ్’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ చేసినందుకు విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ” ఆ కామెంట్స్ నా మనసు నొప్పించాయి. అందరూ నన్ను వెలివేసినట్లు అప్పట్లో నాకు కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని.  రాత్రంతా […]

Published By: HashtagU Telugu Desk
Rashmika Sita Ramam

Rashmika Sita Ramam

తనను ఉలిక్కిపడి లేచేలా.. వెక్కివెక్కి ఏడ్చేలా చేసిన ఒక చేదు అనుభవం గురించి రష్మిక మందన చెప్పుకొచ్చింది. పీడకలలా వెంటాడిన ట్రోల్స్ గురించి వివరించింది. 2019లో విడుదలైన ‘డియర్‌ కామ్రెడ్’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ చేసినందుకు విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ” ఆ కామెంట్స్ నా మనసు నొప్పించాయి. అందరూ నన్ను వెలివేసినట్లు అప్పట్లో నాకు కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని.  రాత్రంతా ఏడుస్తూ కూర్చునేదాన్ని” అని రష్మిక వివరించారు.

”నేను ఆ రోజులను ఎలా అధిగమించానో నాకే తెలియదు విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో నాకే తెలియదు” అని ఆమె చెప్పారు.” నేను చాలా సున్నిత మనస్కురాలిని. అందుకే ట్రోలింగ్ గురించి అంతగా బాధపడ్డాను” అని పేర్కొన్నారు. రష్మిక చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. తన తదుపరి చిత్రం ‘గుడ్‌బై’ ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన ‘గుడ్‌బై’ సినిమా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఈ చిత్రంతో రష్మిక బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది. వీటితో పాటు సిద్దార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’లో, రణబీర్ కపూర్‌ సరసన ‘యానిమల్‌’ చిత్రాల్లోనూ నటిస్తోంది.

  Last Updated: 04 Oct 2022, 12:59 PM IST