Rashmika-Vijay: విజయ్ ను ఓ రేంజ్ లో టీజ్ చేసిన రష్మిక.. ఓల్డ్ వీడియో వైరల్

రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్  గురించి అందరికీ తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రిలేషన్  గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట నిత్యం పార్టీలు, టూర్లు, ఫంక్షన్లలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ఇక ఏకాంతంగా బీచ్ లో ఎంజాయ్ కూడా చేసేస్తుంటారు. ఈ ఇద్దరు డీప్ రిలేషన్ లో ఉన్నారని, అందుకే డేటింగ్ (Dating) చేస్తున్నారని నెటిజన్స్ (Netizens) చాలాసార్లు చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. అయినా ఈవేమీ పట్టించుకోకుండా రష్మిక, విజయ్ తన సానిహిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

డేటింగ్ వార్తలపై ఈ ఇద్దరు స్టార్స్ కొట్టిపారేస్తూ తాము కేవలం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చి చెబుతున్నారు. కానీ వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక, విజయ్ కెమిస్ట్రీ (Chemistry) తెరపైనే కాకుండా, బయట కూడా అదేస్థాయిలో ఉంటుంది. క్లోజ్ గా మూవ్ కావడం, పబ్లిక్ లో కలిసి కనిపించడం, ఒకరిపై మరొకరు ప్రేమను ప్రదర్శించడం లాంటి ద్రుశ్యాలను చాలాసార్లు చూశాం. ఇటీవల ఈజంటకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది.

విజయ్ తన హెయిర్ స్టైల్ (Hair Style) ను సరిచేసుకుంటుండగా, రష్మిక (Rashmika Mandanna) అక్కడ వాలిపోయి విజయ్ ను ఆట (Tease) పట్టిస్తుంది. తన రెండు చేతులతో విజయ్ హెయిర్ స్టైల్ ను చిందరవందర చేస్తుంది. విజయ్ వద్దని చెప్పినా వినకుండా రష్మిక టీజ్ చేస్తుంది. రష్మిక విజయ్ ఎలా ఆట పట్టించిందో ఈ వీడియో (Video)ను చూస్తే మీకే అర్థమవుతుంది.

Also Read: Pushpa2 Update: పుష్ప-2లోకి జగ్గూబాయ్ ఎంట్రీ.. కీలక పాత్రలో జగపతి బాబు!

  Last Updated: 20 Apr 2023, 06:03 PM IST