కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగులో ఛలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ.. ఇలా వరుస హిట్స్ పడటంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. పుష్ప, తమిళ్ లో వరిసు సినిమాలతో నేషనల్ స్టార్ అయిపొయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక మందన్నా మిగిలిన హీరోయిన్స్ కంటే ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు రష్మిక చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.
రష్మిక బాలీవుడ్(Bollywood) లో రణబీర్ కపూర్(Ranbir Kapoor) యానిమల్(Animal) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప 2 సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూట్ వచ్చే సంవత్సరం మొదలవ్వనుంది. రెయిన్ బో అనే ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా నటిస్తుంది. ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం తెలుగు – తమిళ్ లో రిలీజ్ కాబోతుంది.
హిందీలో విక్కీ కౌశల్ సరసన చావా అనే ఓ సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో కూడా రష్మికని అనుకుంటున్నారని సమాచారం. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ ఫిమేల్ లీడ్ సినిమా కూడా రష్మిక ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నట్టు సమాచారం.
ఇలా చేతిలో దాదాపు అరడజను పైగా సినిమాలు పెట్టుకొని ఇటు సౌత్ లో అటు నార్త్ లో బిజీగా ఉంది రష్మిక. ఈ సినిమాలల్లో సగం భారీ అంచనాలు ఉన్న సినిమాలే. వీటిల్లో యానిమల్, పుష్ప 2 రిలీజయితే రష్మిక స్టార్ డమ్ మరింత పెరిగి మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం.
Also Read : Rashmika : మరో కోటి పెంచిన రష్మిక..?