Site icon HashtagU Telugu

Ram Charan : రామ్ చరణ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయబోతుందా..?

Rashmika Mandanna Special Song In Ram Charan Rc16 Movie

Rashmika Mandanna Special Song In Ram Charan Rc16 Movie

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత RC16 మొదలు పెట్టనున్నారు. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకొని చరణ్ డేట్స్ కోసం మూవీ టీం అంతా ఎదురు చూస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ని పాటల చిత్రీకరణతో మొదలు పెట్టబోతున్నారట. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఆల్రెడీ రెహమాన్ మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశారట. ఈ మూడు సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూడు సాంగ్స్ లో ఒకటి స్పెషల్ సాంగ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సాంగ్ ని ఒక స్టార్ హీరోయిన్ తో చేయించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈక్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నని సంప్రదించినట్లు తెలుస్తుంది.

RC16 నిర్మాతల్లో దర్శకుడు సుకుమార్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న పుష్పలో రష్మికనే హీరోయిన్. దీంతో సుకుమార్ అడిగిన వెంటనే రష్మిక ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, రష్మిక కామన్ ఫ్యాన్స్ అయితే.. ఈ వార్త నిజమైతే బాగుందని ఫీల్ అవుతున్నారు.

కాగా మెగా అభిమానులంతా జాన్వీ పాపతో చరణ్ చేయబోయే సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘అబ్బని తియ్యని దెబ్బ’ అంటూ చిరంజీవి, శ్రీదేవి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసారు. ఇప్పుడు వారి వారసులుగా వచ్చిన రామ్ చరణ్, జాన్వీ కపూర్.. ఈ సినిమాలోని తమ కెమిస్ట్రీతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.