Site icon HashtagU Telugu

Rashmika Mandanna : ఏదేమైనా డిమాండ్ అంటే రష్మికదే..!

Rashmika Another Bollywood Crazy Offer

Rashmika Another Bollywood Crazy Offer

Rashmika Mandanna కన్నడ భామ రష్మిక ఇటు సౌత్ అటు నార్త్ రెండిటిలో సూపర్ బిజీగా ఉంది. యానిమల్ ముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఆ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. రష్మిక కోసం దర్శక నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. తెలుగులో గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్న రష్మిక ధనుష్ కుబేరలో కూడా నటిస్తుంది. వీటితో పాటుగా సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఆఫర్ అందుకుంది.

ఇక లేటెస్ట్ గా రష్మిక కోసం మరో లేడీ ఓరియెంటెడ్ కథ పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా కొత్త దర్శకుడు కథ రెడీ చేశాడట. రష్మిక కు కథ వినిపిద్దామని వెళ్తే కథ వినకుండానే అమ్మడు కాదనేసిందట. అదేంటి అంటే సినిమా ఇప్పుడు ఓకే చేసినా 2026లోనే అది సాధ్యమవుతుందని అంటుందట. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా రష్మిక డేట్స్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.

రష్మిక సినిమాలో ఉంది అంటే అటు గ్లామర్ తోనే కాదు యాక్టింగ్ తో కూడా మెప్పిస్తుంది. ఇదే సెంటిమెంట్ గా భావిస్తున్న సినీ మేకర్స్ ఆమెకు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. రష్మిక కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉన్నా ఆమె చేసే దాకా ఎదురుచూస్తామని అంటున్నారు. మరి కొత్త సినిమా దర్శక నిర్మాతలు కూడా రష్మిక కోసం అప్పటిదాకా ఎదురుచూస్తారా లేదా అన్నది చూడాలి.