Site icon HashtagU Telugu

Rashmika Mandanna: పుష్ప 2 సెట్ నుంచి ఆ ఫోటోను షేర్ చేసిన రష్మిక.. ఫోటోస్ వైరల్?

Mixcollage 13 Feb 2024 07 56 Am 3847

Mixcollage 13 Feb 2024 07 56 Am 3847

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళం హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక. ఇటీవలె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో భారీ హిట్ ను అందుకుంది. కాగా రష్మిక నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఒకటి. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ పుష్ప 2 సినిమా షూటింగ్లో తీసుకున్నవని అర్థమవుతోంది. అయితే పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ గతంలో దర్శకుడు సుకుమార్ క్యాండిడ్ ఫోటోలను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక మందన్న వంతు వచ్చింది. సుకుమార్ సింహం విగ్రహంపై చేతులు పెట్టి ఫోజ్ ఇచ్చిన ఫోటో తీసింది రష్మిక మందన్న. ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోస్ ని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే 2021 లో విడుదలైన పుష్ప పార్ట్ వన్ కి సీక్వల్ గా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు..

Exit mobile version