Site icon HashtagU Telugu

Rashmika and Vijay: ముచ్చటగా మూడోసారి.. విజయ్ తో నటించేందుకు రష్మిక వెయిటింగ్!

Vijay And Rashmika

Vijay And Rashmika

టాలీవుడ్ బ్యూటీ రష్మిక (Rashmika) మందన్న నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తన రాబోయే తమిళ చిత్రం వరిసు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో మూడవసారి కలిసి నటించనున్నట్టు ఇష్టం చూపుతోంది. శ్రేయోభిలాషులు, అభిమానులు మా పెయిర్ ను చూడాలనుకుంటున్నారని, విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయాలని తాను ఆశిస్తున్నాను రష్మిక ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

విజయ్ దేవరకొండతో మరో ప్రాజెక్ట్‌పై సంతకం చేయనున్నారనే వార్తలపై ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. ‘ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది’ విజయ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. రష్మిక (Rashmika), విజయ్ చివరిసారిగా డియర్ కామ్రేడ్ చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంలో మహిళా క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. విజయ్, రష్మిక డేటింగ్ (Dating) చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి నటించేందుకు ఆసక్తి చూపడం హాట్ టాపిక్ గా మారింది.

“ప్రస్తుతానికి విజయ్ తో కలిసి నటించడం లేదు. కానీ అది ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మేం తెరపైకి వచ్చి కొంత కాలం అయ్యింది. మా శ్రేయోభిలాషుల నుండి నాకు చాలా రిక్వెస్ట్ లు వస్తున్నాయి. కచ్చితంగా కలిసి నటించాలనుకుంటున్నాం. మా ఇద్దరికి సరిపోయే స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాం’’ అని (రష్మిక Rashmika) తెలిపింది. ఇక ఈ జంట న్యూయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా మల్దీవ్స్ లో వెకేషన్ కు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Jinthaak Song Teaser: ధమాకా ‘జింతక్’ సాంగ్ టీజర్ రిలీజ్!