Site icon HashtagU Telugu

Rashmika Mandanna : రష్మిక రెయిన్ బోకి అడ్డొచ్చిన కారణాలు ఏంటి..?

Srivalli 2.O in Pushpa 2 Says Rashmika Mandanna

Srivalli 2.O in Pushpa 2 Says Rashmika Mandanna

సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంటూ సూపర్ ఫాం కొనసాగిస్తున్న భామ రష్మిక మందన్న (Rashmika Mandanna). అమ్మడు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. అందుకే దర్శక నిర్మాతలంతా కూడా రష్మిక వెంట పడుతున్నారు. యానిమల్ హిట్ తో తన క్రేజ్ మరింత పెంచుకున్న రష్మిక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలతో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేసుకుంది.

రష్మిక ప్రస్తుతం పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటుగా రెయిన్ బో సినిమాలో కూడా నటిస్తుంది. రెయిన్ బో సినిమా ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. రష్మిక సినిమా ఆగిపోవడానికి కారణం ఆమె క్రేజే అని అంటున్నారు. అదేంటి ఇమేజ్ పెరిగితే సినిమా రేంజ్ పెరగాలి కదా అంటే రెయిన్ బో సినిమా ఓకే అనుకున్న టైం లో రష్మిక పుష్ప1, యానిమల్ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఆమె రేంజ్ వేరు అందుకే రష్మిక రెయిన్ బో వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారట.

అంతేకాదు ఈ సినిమాకు రష్మిక చాలా తక్కువ రెమ్యునరేషన్ కి సైన్ చేసిందట. సినిమా పూర్తి చేయాలంటే ఆమె అదనపు డేట్స్ అవసరం ఉన్నాయట. సో సినిమా పూర్తి చేయాలంటే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొంత కథలో మార్పులు కూడా చేయాల్సి ఉందట. అందుకే శాంతరుబన్ డైరెక్షన్ లో రాబోతున్న రెయిన్ బో సినిమా ప్రస్తుతానికి ఆపేసినట్టు తెలుస్తుంది.

మళ్లీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా పూర్తిగా అటకెక్కేస్తుందా అన్నది త్వరలో తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేసిన రెయిన్ బో సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం మాత్రం రష్మిక ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుంది.

Also Read : Sai Pallavi : స్టార్ తనయుడితో జపాన్ లో సాయి పల్లవి.. ఫోటోతో లీకైన మ్యాటర్..!