Rashmika Mandanna: జపాన్‌కు బయల్దేరిన రష్మిక.. అందుకోసమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 29 Feb 2024 10 36 Am 6915

Mixcollage 29 Feb 2024 10 36 Am 6915

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమిళంలో ధనుష్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇలా చేతినిండా ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది రష్మిక. రష్మిక మందన ప్రస్తుతం జపాన్‌కు బయల్దేరింది. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇంత బిజీలోనూ టోక్యోకి వెళ్తుంది అంటే అది చాలా ముఖ్యమైన పని అని చెప్పాల్సిన పని లేదు.

షూటింగ్ కోసం మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. క్రంచీ రోల్ యానిమీ అవార్డును తీసుకునేందుకు రష్మిక అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అవార్డుల కోసం మన దేశం నుంచి తొలిసారిగా రష్మిక అక్కడకు వెళ్తోంది. రష్మిక ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉండటంతోనే యానిమల్ తరువాత సక్సెస్ మీట్‌లో ఎక్కడా కనిపించలేదు. ఇలా యానిమల్ సక్సెస్ మీట్‌లో కనిపించకపోవడంతో రష్మిక హర్ట్ అయిందని, అందుకే దూరంగా ఉంటోందనే రూమర్లు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని, తాను ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో సక్సెస్ పార్టీల్లో భాగం కాలేకపోయానని క్లారిటీ ఇచ్చింది.

  Last Updated: 29 Feb 2024, 10:37 AM IST