Site icon HashtagU Telugu

Rashmika and Vijay vacation: మల్దీవ్స్ లో విజయ్ తో ఎంజాయ్ చేస్తోన్న రష్మిక!

Vijay And Rashmika

Vijay And Rashmika

సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ జంట్ ఏదైనా ఉందంటే.. మొదటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మాత్రమే గుర్తుకువస్తారు. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ జంట కెమిస్ట్రీ ఓ రెంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఈ పెయిర్ మాల్దీవ్ టూర్స్ లో ఉన్నారు. వెకేషన్ కోసం ఒక్కటిగా వెళ్లారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్దీవ్ వెకేషన్ ఉన్న రష్మిక ఓ ఫొటోను షేర్ చేసింది. ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్‌లో ఉన్న రష్మిక ట్రాపికల్ వ్యూతో మిర్రర్ సెల్ఫీని క్లిక్ చేసింది. హాయ్ లవ్స్ విత్ ఎ వైట్ హార్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఎప్పుడూ హట్ టాపిక్ గా నిలుస్తోంది. రెగ్యులర్ గా పబ్బులు, షాపింగ్స్, నైట్ పార్టీస్ కు కలిసి వెళ్తుండటం, ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో ఈ జంట డేటింగ్ ఉన్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.