Rashmika Mandanna : ధైర్యస్తులనే అదృష్టం వరిస్తుంది.. రష్మిక విజయ సూత్రం వైరల్!!

  • Written By:
  • Updated On - May 20, 2022 / 05:29 PM IST

“ధైర్యే సాహసే లక్ష్మి” అన్నారు పెద్దలు. భారీ సినిమా ఛాన్స్ లు సాధిస్తూ, బడా హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన కూడా ఇదే డైలాగ్ చెబుతున్నారు. “ధైర్యస్తులనే అదృష్టం వరిస్తుంది” అని పేర్కొంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తన జిమ్ వర్క్ అవుట్ తర్వాత దిగిన ఒక సెల్ఫీని కూడా ఈ పోస్ట్ తో పాటు ఆమె షేర్ చేశారు. నలుపు రంగు అథ్లెటిక్స్ డ్రెస్సులో దిగిన ఈ సెల్ఫీ నెటిజన్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇటువంటి మరెన్నో స్ఫూర్తిదాయక ఫోటోలను గతంలో రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. తన తల్లిదండ్రులు, చెల్లితో కలిసి దిగిన ఒక ఫోటోను ఇటీవల రష్మిక షేర్ చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫోటోతో పాటు ఆమె రాసిన ఎమోషనల్ కోట్ భళా అనిపించింది. ” మా కుటుంబం లో అందరి ముఖలపై ఈ చిరునవ్వు కు కారణం మీరే. ఇదంతా మీ చలువే” అని రష్మిక చేసిన కామెంట్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఊటీలో ఇటీవల జరిగిన తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన రష్మిక.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇవి కూడా వైరల్ అయ్యాయి. రష్మిక్ కొత్త మూవీ ప్రాజెక్టుల్లో ” పుష్ప : ది రూల్”, “తలపతి 66”, “సీతా రామం”, “మిషన్ మజ్ను”, “గుడ్ బై”, “యానిమల్” ఉన్నాయి. వీటి షూటింగ్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది.