టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) మందన్న వీల్ చైర్లో (Wheelchair) కనిపించడం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వీల్చైర్లో తీసుకెళ్లారు. తన ముఖం కనిపించకుండా క్యాప్ కవర్ చేశారు. ఇటీవలే ఆమె జిమ్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికిన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని ఆమె తాజాగా ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసింది. అయితే ఇది చూసి ఏముందిలే త్వరగానే సెట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈరోజు అసలు నడవలేని స్థితిలో ఉండడం చూసి అయ్యో..రష్మిక అంత ఇబ్బంది పడుతుందా…? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Karnataka Road Accident : సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..ప్రస్తుతం ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj ) జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’ (Chhaava) లో నటిస్తుంది. శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ , ఆయన భార్యగా రష్మిక (Rashmika Mandanna) ఈ మూవీ లో నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. మంగళవారం రష్మిక లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ పై.. రష్మిక మందన్న ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. ప్రతి గొప్ప రాజు వెనుకాల.. యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ చూసిన నేషనల్ క్రష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
#rashmikamnadanna on wheelchair at Mumbai Airport pic.twitter.com/Qb7KGcJ2vr
— Lakshminarayana Varanasi (@lnvaranasi) January 22, 2025