Site icon HashtagU Telugu

Rashmika Mandanna : రష్మిక వర్కౌట్స్ చూశారా? ఎంత కష్టపడుతుందో..

Rashmika Mandanna Latest Workout Video goes Viral

Rashmika Mandanna Latest Workout Video goes Viral

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో రష్మిక మందన్న(Rashmika Mandanna )ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రష్మిక ఫేక్ వీడియో వైరల్ అవ్వడంతో రష్మికతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా రష్మిక తన సోషల్ మీడియాలో ఓ వర్కౌట్(Workout) వీడియో షేర్ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఉదయాన్నే రకరకాల వర్కౌట్స్ చేస్తూ తీసిన ఓ వీడియోని రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మంచి వర్కౌట్ చేస్తే ఆ రోజంతా చాలా బాగుంటుంది. నన్ను ఎంత కష్టపెట్టినా మరింత స్ట్రాంగ్ గా వస్తాను. నాకోసం ఇలాంటి ఈజీ వర్కౌట్స్ రూపొందించారు అంటూ తన ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్ ని ట్యాగ్ చేసింది. దీంతో ఈ వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతకు కూడా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చేది ఇతనే. జునైద్ షేక్ వద్ద రష్మిక ఇటీవలే చేరినట్టు తెలుస్తుంది.

ఇక రష్మిక త్వరలో యానిమల్ సినిమాతో రాబోతుంది. వచ్చే సంవత్సరం పుష్ప 2 సినిమాతో పలకరించనుంది. ఇవే కాకుండా చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.

 

Also Read : Manchu Vishnu : రష్మిక ఫేక్ వీడియోపై ఫైర్ అయిన మంచు విష్ణు.. ‘మా’ తరపున పోరాడతాం..