టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్నా (Rashmika Mandanna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రష్మిక ముంబై విమానాశ్రయంలో మెరిసింది. బ్లాక్ కలర్ డ్రసులో అందంగా మెరిసిపోతూ నవ్వులు చిందిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
అంతేకాదు.. వాళ్లతో సెల్ఫీలు దిగి సందడి చేసింది. కమర్షియల్ షూట్ కోసం ముంబై వెళ్లిన రష్మిక ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దుపట్టా నల్లటి కుర్తా ధరించి కనిపించింది. ఫ్యాషన్ రంగంలో యువ హృదయాలను దోచుకుంటూనే, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని రూపొందించడంలో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప2, యానిమల్ సినిమాలతో పాటు ‘రెయిన్‌బో’ మూవీతోనూ బిజీగా ఉంది.
(Rashmika Mandanna) తనకు సమయం దొరికిన ప్రతిసారీ నెట్టింట అభిమానులతో మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీకు ఇష్టమైన ప్రాంతం ఏదని ప్రశ్నించగా.. కూర్గులో ఉన్న మా ఇల్లంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పింది రష్మిక. హైదరాబాద్‌లో ఉన్నా మీ స్నేహితులతో ఎలా మాట్లాడతారు? అన్న ప్రశ్నకు ‘నమస్తే.. ఎట్లున్నారు.. వచ్చేసేయ్, మస్తుంది…ఏంది, నీయమ్మ, కొడదాం’ ఇవే మాట్లాడుతుంటా’’ అని చెప్పారు.