Rashmika Mandanna : బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఏకంగా సల్మాన్ ఖాన్‌తో..

బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న. ఏకంగా సల్మాన్ ఖాన్‌తో..

Published By: HashtagU Telugu Desk
Rashmika Mandanna Is Selected For Salman Khan Sikandar Movie Heroine Role

Rashmika Mandanna Is Selected For Salman Khan Sikandar Movie Heroine Role

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. నార్త్ టు సౌత్ వరుస హిట్స్ ఇస్తూ అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. రణ్‌బీర్ ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ని, ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. దీంతో అక్కడ పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో రష్మికకి అవకాశాలు వస్తున్నాయి. ఈక్రమంలోనే విక్కీ కౌశల్ నటిస్తున్న భారీ పిరియాడికల్ మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ‘సికందర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడిగా రష్మికని ఎంపిక చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ పిఆర్ తరణ్ ఆదర్శ్ తెలియజేసారు. ఈ న్యూస్ తో రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా సల్మాన్ ఖాన్, మురుగదాస్ ప్రస్తుతం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి వరుస సక్సెస్ లు అందుకుంటున్న రష్మిక.. తన లక్కీ హ్యాండ్ తో వీరికి సక్సెస్ ని అందించి తన స్టార్‌డమ్ ని మరింత పెంచుకుంటారో లేదో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని సాజిద్ నదివాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్ కు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

  Last Updated: 09 May 2024, 10:21 AM IST