Rashmika : రష్మిక కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మిక మందన్న

Published By: HashtagU Telugu Desk
Rashmikanational Ambassador

Rashmikanational Ambassador

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ..నటి రష్మిక (Rashmika)కు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా రష్మిక మందన్న(Rashmika Mandanna) నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మనం డిజిటల్ (Digital) యుగంలో జీవిస్తున్నాము. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ (Cybercrime) అత్యధిక స్థాయిలో ఉంది. నా డీప్ ఫేక్ వీడియో ని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను భారత ప్రభుత్వం (Government of India)తో కలిసి పని చేస్తున్నానని ఓ వీడియోను విడుదల చేసింది రష్మిక. కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ (National Ambassador of I4C for promoting cyber safety) రష్మిక మందన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే దేశంలో సైబర్ భద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సరైన అవగాహన కల్పించడంలో మీ నియామకం ఉపయోగపడుతుందని అభిలషిస్తున్నాను. తన ట్వీట్ లో కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

ఇక యూత్ క్వీన్ , నేషనల్ క్రష్ రష్మికమందన్నగురించి చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు తెలుగు , తమిళ్ , కన్నడ ప్రేక్షకులకు మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ చిన్నది..యానిమల్ మూవీ తో నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టింది. తెలుగు తో పుష్ప 2 (Pushpa 2)తో పాటు మరో మూవీ మాత్రమే చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో ఆమె సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నిర్ణయం తీసుకోవడం పై అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP Liquor Policy : ఏపీ మద్యం టెండర్లలో భారీ కుంభకోణం – మాజీ మంత్రి అమర్ నాధ్

  Last Updated: 16 Oct 2024, 01:11 PM IST