Site icon HashtagU Telugu

Rashmika Injured : ప్రమాదానికి గురైన రష్మిక..కోలుకోవాలంటూ ఫ్యాన్స్ మొక్కులు

Rashmika Injured

Rashmika Injured

Rashmika Mandanna Injured : యూత్ క్వీన్ , నేషనల్ క్రష్ రష్మికమందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. రష్మిక (Rashmika ) ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు తెలుగు , తమిళ్ , కన్నడ ప్రేక్షకులకు మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ చిన్నది..యానిమల్ మూవీ తో నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టింది. తెలుగు తో పుష్ప 2 (Pushpa 2)తో పాటు మరో మూవీ మాత్రమే చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు ప్రమాదానికి గురైన విషయం ఇండస్ట్రీ తో పాటు అభిమానులకు షాక్ ఇస్తుంది. తాను ప్రమాదానికి గురైన విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపింది.

” హే గయ్స్.. ఎలా ఉన్నారు మీరు.. గత కొన్నిరోజులుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను. పబ్లిక్ లో కనిపించలేదు.గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం, నాకు చిన్న ప్రమాదం (మైనర్) జరిగింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. నేను డాక్టర్లు చెప్పినట్లుగా ఇంట్లోనే ఉన్నాను. నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ఇకనుంచి నా రెగ్యులర్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉంటాను. మీరు కూడా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ జీవితం చాలా చిన్నది. రేపు ఉంటుందో లేదో చెప్పలేము.. ప్రతి రోజును సంతోషంగా గడపండి. మరొక అప్‌డేట్ నేను చాలా లడ్డూలు తింటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమెకు ఎలా ప్రమాదం జరిగిందనే విషయం మాత్రం తెలుపకపోయేసరికి ఫ్యాన్స్ ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.

Read Also : Chandrababu : రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది – చంద్రబాబు