Site icon HashtagU Telugu

Rashmika With Govinda: గోవిందాతో ర‌ష్మిక “సామి సామి” డ్యాన్స్‌.. స్టార్ హీరో ఫిదా, వీడియో వైరల్!

Rashmika

Rashmika

పుష్ప సినిమాలోని “సామి సామి” సాంగ్ కు రష్మిక మందన్నా వేసిన స్టెప్పులు ఇంకా అందరికీ గుర్తున్నాయి. ఇపుడీ పాట‌కు మ‌రోసారి డ్యాన్స్ చేసి అద‌ర‌హో అనిపిస్తోంది ర‌ష్మిక‌. ఆమె న‌టిస్తున్న హిందీ చిత్రం “గుడ్‌బై”.ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సెప్టెంబర్ 25న జీ టీవీలో ప్ర‌సార‌మైన DID SuperMoms ఫైనల్ షోకు హాజ‌రైంది ర‌ష్మిక. ఈ షోకు గెస్ట్ గా హాజరైన స్టార్ యాక్ట‌ర్ గోవిందాతో క‌లిసి “సామి సామి” పాట‌కు డ్యాన్స్ చేసింది. “సామి వేదిక మీద‌ ఉన్నప్పుడు.. మీరు మీ కళ్లు ప‌క్క తిప్పుకోలేరు సామీ” అంటూ జీ ఛాన‌ల్ ప్రోమోను షేర్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

నేషనల్ క్రష్ ఇమేజ్‌..

వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న గుడ్ బై చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీ రోల్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇంతకు ముందు నటించిన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్‌ను రష్మికా సొంతం చేసుకుంది. రష్మిక త్వరలో ‘పుష్ప 2′ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రంలో ఆమె అల్లు అర్జున్‌తో మళ్లీ జతకట్టనుంది.

వర్ష బుమ్ర.. కూలీ నుంచి Super Mom స్థాయికి!!

“DID Super Moms” షో ఫైనల్స్ లో వర్ష బుమ్ర గెలిచారు. మొత్తం ఆరుగురు ఫైనల్స్ లో పోటీపడగా విజయం వర్ష బుమ్ర ను వరించింది. దీంతో ఆమెకు దాదాపు రూ.7.50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. ఈ పోటీలో పాల్గొనేందుకు రావడానికి ముందు ఆమె ఒక సాధారణ దినసరి కూలీ. 17 ఏళ్లకే పెళ్లి అయింది. ఆమెకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త, వర్ష బుమ్ర కలిసి కూలీ పనులు చేసేవారు.

Exit mobile version