Site icon HashtagU Telugu

Rashmika Mandanna : నా మేనేజర్‌తో విబేధాలు లేవు.. ఆ వార్తలు అవాస్తవం.. రష్మిక మందన్న

Rashmika Mandanna gives clarity on issues with her manager

Rashmika Mandanna gives clarity on issues with her manager

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూట్స్ తో పాటు వరుస యాడ్స్ చేస్తుంది. రష్మిక డేట్స్, రెమ్యునరేషన్స్.. మరిన్ని వివరాలన్నీ ఒక మేనేజర్(Manager) చూసుకుంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా రష్మిక మేనేజర్ 80 లక్షల మోసం చేశాడని, రష్మిక అతన్ని తీసేసిందని వార్తలు వచ్చాయి. రష్మిక తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది రష్మిక. దీనిపై స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేమిద్దరం ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం. మేము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవు అని తెలిపింది.

దీంతో గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలకు రష్మిక చెక్ పెట్టింది. ఇక ప్రస్తుతం రష్మికకు చెందిన డేట్స్, రెమ్యునరేషన్ వివరాలు బాలీవుడ్ కి చెందిన ఓ సంస్థ చూస్తున్నట్టు సమాచారం.

 

Also Read : SPY Trailer : నిఖిల్ ‘స్పై’ టీజర్ అదిరిందిగా.. రానా గెస్ట్ అప్పీరెన్స్..