Indian Celebrities: రష్మిక క్రేజ్ మాములుగా లేదు.. సెలబ్రిటీస్ లిస్ట్‌లో నేషనల్ క్రష్!

ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లిస్ట్‌లో రష్మిక స్థానం సంపాదించుకుంది.

Published By: HashtagU Telugu Desk
Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) కు రోజురోజుకు ఫాలోయింగ్ పెరిగిపోతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ  మరోసారి జాతీయ స్థాయిలో అందర్నీ ఆకర్షించింది. ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో రష్మిక మూడో స్థానంలో (Third Place) నిలిచింది. చాలామంది స్టార్స్ ను వెనక్క నెట్టింది. ఈ నెల ప్రారంభంలో రష్మిక తన పుట్టినరోజును జరుపుకుంది, ఆ తర్వాత పుష్ప 2 (Pushpa2) టీజర్‌ను విడుదలైంది.

ఈ రెండు అంశాలు రష్మికను సోషల్ మీడియా (Social Media)లో టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టాయి. దీంతో ఆమె ఆటోమేటిగ్గా పాపులర్ ఫీచర్స్ లిస్ట్ లోకి ఎంటరైంది. రష్మిక ఇలా టాప్ చార్టుల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఇండియాలో నిర్వహించిన ఎన్నో సర్వేల్లో ఆమె టాప్-10 లిస్ట్ లో చోటు దక్కించుకుంది.

ఒక దశలో ఆమె నేషనల్ క్రష్ గా (Rashmika Mandanna) అవతరించింది. ఆ పాపులారిటీనే రష్మికకు వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ, బాలీవుడ్ లో రణబీర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇక తెలుగులో బన్నీతో పుష్ప-2 సెట్స్ లో ఉంది. రీసెంట్ గా రెయిన్ బో అనే సినిమా లాంఛ్ చేసింది. వీటితో  పాటు (Rashmika Mandanna) నితిన్ (Nithin) తో ఓ సినిమా చేయబోతోంది. ఇటీవల రష్మిక తన అభిమానులకు సోషల్ మీడియాలో ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె చర్యపై నెటిజన్స్ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు.

  Last Updated: 17 Apr 2023, 11:02 AM IST