Site icon HashtagU Telugu

Interview : పుష్పరాజ్, శ్రీవల్లి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’.. రష్మిక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!

Rashika

Rashika

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది రష్మిక మంధాన. అందానికి అందం.. అభినయానికి అభినయం రెండూ తోడవ్వడంతో తెలుగు తెరపై ‘తగ్గేదే లా’ అంటూ దూసుకుపోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప మూవీ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీగ్లామర్ పాత్ర ఎలా అనిపించింది? పుష్పరాజ్ తో కెమిస్ట్రీ ఎలా ఉంది? లాంటి ఇంట్రస్టింగ్ విషయాలను ‘హ్యాష్ ట్యాగ్ యూ’ తో షేర్ చేసుకున్నారు. అవన్నీ మీకోసం..

హాయ్ రష్మికా ఎలా ఉన్నారు?

గుడ్ అండీ

శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

శ్రీవల్లికి, రష్మిక చాలా తేడా ఉంటుంది. నార్త్ అమ్మాయి, సౌత్ అమ్మాయిల మధ్య ఎలా ఢిపరెన్స్ ఉంటుందో, అలాగే శ్రీవల్లి, రష్మిక అన్ని వేరియేషన్స్ ఉంటాయి. కంప్లీట్ గా చాలా డిఫరెంట్. నేను స్క్రీన్ పై చూసి నేనేనా? అన్నట్టు ఉంది. అల్లు అర్జున్ చూస్త పుష్పరాజ్ మాత్రమే కనిపిస్తాడు. అలాగే సునీల్ మంగళం శ్రీను, అనసూయ మంగళం శ్రీనుగా మాత్రమే కనిపిస్తారు. అదొక మ్యాజిక్ అంతే.

‘గీత గోవిందం’లో మీరు అల్లు అర్జున్ తో నటించాలని బలంగా కోరుకున్నారు కదా.. ఆ అవకాశం ‘పుష్ప’ రూపంలో రావడం ఎలా ఉంది?

సుకుమార్ గారూ ఫోన్ చేసి హీరో అల్లు అర్జున్ అని, బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పినప్పుడు.. బహుశా ఇది చాలా సమయం పట్టొచ్చు అని అనుకున్నా. కానీ ఇంత త్వరగా సెట్స్ పైకి వెళ్తుందని ఊహించలేదు.

‘‘శ్రీవల్లి క్యారెక్టర్ డీగ్లామర్ గా ఉంటుంది’’ అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

ఐ థింక్.. మీరు ఏదైనా రొమాంటిక్ సినిమా మాట్లాడుకున్నప్పుడు రొమియో-జూలియట్, ముంతాజ్-షాజహాన్ జంట ఎలాగైతే గుర్తుకువస్తారో.. పుష్ప సినిమా అనగానే శ్రీవల్లి, పుష్పరాజ్ జంట గుర్తుకువస్తోంది. వీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. శ్రీవల్లి క్యారెక్టర్ ను చాలా బాధ్యతయుతంగా భావించా. ఫుష్పలో డీ గ్లామర్ గా నటించడం చాలెజింగ్ అనిపించింది.

మొదటి ప్రయత్నంలోనే మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు? అలాంటిది పుష్పలో రాయలసీమ డైలాగ్స్ ఎలా పలికారు?

నాకే తెలియదండీ(నవ్వుతూ).. ఇప్పుడిప్పుడే నేను తెలుగు పూర్తిగా నేర్చుకుంటున్నా. ఇప్పుడు తెలుగు నేర్చుకొని.. మళ్లీ యాస మాట్లాడటం కొంచెం కష్టం. చిత్తూరు యాస అనే చాలా డిఫరెంట్. అక్కడి ప్రజలు చిత్తూరు యాస మాట్లాడుతున్నప్పుడు.. నాకు చాలా కొత్తగా ఉంది. వాళ్లు తిడుతున్నారో లేదా ప్రేమ చూపిస్తున్నారో అర్థమయ్యేది కాదు!

పుష్పలో ప్రతిఒక్కరూ చాలా డిఫరెంట్ కనిపిస్తారు. మీకు పుష్పరాజ్ ఎలా ఉంటారో ముందే తెలుసుకున్నారా?

నేను ఫస్ట్ డే సెట్స్ లో అడుగుపెట్టినప్పుడు అల్లు అర్జున్ (సార్) కోసం వెయిట్ చేస్తున్నా.. ఆయన ఎక్కడా ఉన్నారని సెట్స్ మొత్తం చూశా. అయితే ఓ దగ్గర గ్రే కలర్ హెయిర్, మాసిన బట్టలు వేసుకొని షూటింగ్ కు రెడీ అయ్యాడు. నేను చూసి షాక్ అయ్యాను. అలాగే నేను శ్రీవల్లి గెటప్ లో ఉన్నప్పుడు ఆర్టిస్టులంతా నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నా ముందే రష్మిక ఎక్కడ అంటూ వెతకడం మొదలుపెట్టారు. మేకప్ వేసుకోవడానికి ప్రతిరోజూ రెండు గంటలు పట్టేది. డీ గ్లామర్ గా అనిపించినా.. నేనూ చాలా బాగున్నా. జోవియల్ గా అనిపించింది.

మీరు, బన్నీ సెట్స్ లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉండేది?

బన్నీ చాలా జోవియల్, నేను సరదాగా ఉంటాను. అందుకే షూటింగ్ చాలా సరాదాగా గడిచిపోయేది. బన్నీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కో ఆర్టిస్టు. ప్రతిరోజు మేం చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. సినిమాలు, లైఫ్, ఇతర విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ సార్ చాలా కష్టపడ్డాడు.

పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?

చాలా బాగుంటుంది. ముఖ్యంగా సామి సామి సామి పాట కోసం చాలా కష్టపడ్డాను. ఈ విషయంలో అల్లు అర్జున్ సార్ చాలా హెల్ప్ చేశాడు. దేవి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కూబా కూడా మంచి మంచి యాంగిల్స్ కాప్చర్ చేశారు. దీంతో తెరపై కెమిస్ట్రీ బాగా వర్క వుట్ అయ్యింది.

Exit mobile version