Rashmika : పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో అగ్రశ్రేణి స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్.. వెండితెరపై చిరునవ్వులతో మెరిసే ఆమె జీవితంలో కూడా కొన్ని నిస్సహాయమైన భావోద్వేగాలు ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన వ్యక్తిగత బాధను ఆవిష్కరించగా, అది ఎంతోమందిని భావోద్వేగపరిచింది.
రష్మిక మాట్లాడుతూ.. “నాకు ఒక చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడామెకు 13 ఏళ్లు. చిన్నప్పుడు సెలవులు వచ్చాయంటే తానే నేనే అని ఆనందపడేదాన్ని. చెల్లితో ఆడుకోవాలన్న ఉత్సాహంతో, సెలవుల కోసం ఎదురుచూసే రోజులు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు నా కెరీర్ ప్రారంభమైన నాటినుంచి, గత ఎనిమిదేళ్లుగా ఆమెతో సమయాన్ని గడపలేకపోతున్నాను. అదే నాకు ఎక్కువగా బాధ కలిగిస్తున్న విషయం” అంటూ చెప్పారు.
“గత ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్లలేదు. స్నేహితులను కలవలేకపోయాను. వాళ్లు ఏ ప్లాన్ చేసినా ముందు నన్ను అడిగేవారు. కానీ ఇప్పుడు నా సమయాన్ని ఊహించి వాళ్లే నిర్ణయం తీసుకుంటున్నారు. నాన్నమ్మ ఎప్పుడూ చెప్పేది – వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిందే. కానీ నేను మాత్రం రెండింటికీ సమతుల్యం అవసరమేనని నమ్ముతున్నాను. అందుకే నేను నా జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాను. నా స్వగ్రామాన్ని, కుటుంబాన్ని మిస్ అవుతున్నాను…” అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు రష్మిక.
ఒకవైపు స్టార్ డమ్.. మరోవైపు వ్యక్తిగత బాధల మధ్య సాగుతున్న ఈ నటి జీవితాన్ని చూస్తే, ప్రజల ముందు గ్లామర్‌తో కనిపించే వారికీ పలు భిన్న కోణాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. కెరీర్‌లో రాణించాలనే పట్టుదలతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన రష్మిక ఈ తరం నటీమణుల స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన ‘కుబేర’ చిత్రం హిట్ టాక్‌తో రన్ అవుతోంది. అలాగే ఆమె ‘ధామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘మైసా’ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ వృత్తి విజయాల వెనుక, ఒక చెల్లిని మిస్ అవుతున్న అక్క బాధ మనల్ని కూడా కదిలించకుండా ఉండదు.
Illegal Affair : ప్రియుడితో ఆ పని చేస్తుండగా దొరికన భార్య.. ఆ వెంటనే ఊహించని పరిణామం..!