Rashmika Mandanna కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఇప్పుడు ఒక రేంజ్ ఫాం లో ఉందని చెప్పొచ్చు. అమ్మడు ఏ సినిమా చేసినా సరే అది మంచి సక్సెస్ అవుతుండటం వల్ల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక ఆ సినిమా తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యన్ గా సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లు అందుకుంటుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మురుగదాస్ కామోలో వస్తున్న సికందర్ సినిమాలో అమ్మడు చాన్స్ అందుకుంది. ఈ సినిమాతో పాటుగా చావా సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఐతే ఈ సినిమాకు రష్మిక 13 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని టాక్. నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్.. చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో రష్మికకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇక అందుకు తగినట్టుగానే అమ్మడు పారితోషికం అడుగుతుంది. పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో తో పాటుగా హిందీలో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటే ఈసారి నమ్మేయొచ్చని ఆడియన్స్ అనుకుంటున్నారు. చూస్తుంటే మరో ఐదేళ్ల పాటు రష్మికని కదిలించడం కష్టమే అని చెప్పొచ్చు.
Also Read : Mahesh Babu : రాజమౌళి తర్వాత మళ్లీ త్రివిక్రం తోనే సూపర్ స్టార్..?