Site icon HashtagU Telugu

Rashmika Mandanna దళపతి సాంగ్ కి రష్మిక స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..!

Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో పాన్ ఇండియా వైడ్ హంగామా చేస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు ఫలితాలు కూడా అదిరిపోతుండగా అదే రేంజ్ లో ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం సౌత్ లో రెండు బాలీవుడ్ లో రెండు సినిమాల తో బిజీగా ఉన్న రష్మిక లేటెస్ట్ గా కేరళలో ఒక ఈవెంట్ లో పాల్గొన్నది. ఐతే ఆ ఈవెంట్ లో రష్మిక దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాలో రంజితమే సాంగ్ కి డ్యాన్స్ చేసింది.

రష్మిక రంజితమే (Ranjithame Song) డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దళపతి విజయ్ వారిసు సినిమాలో రష్మికనే హీరోయిన్ గా నటించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఐతే కేరళలో తమిళ స్టార్ హీరో సాంగ్ కి డ్యాన్స్ చేసి హడావిడి సృష్టించింది రష్మిక.

ఈ వీడియోలో రష్మిక శారీ కట్టుకుని ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రోత్సాహం వల్లే ఆమె అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కోసం కూడా రష్మిక అలా చేయాల్సి వచ్చింది. కెరీర్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుని వరుస బ్లాక్ బస్టర్ అందుకుంటున్న సరే రష్మిక కు ఏమాత్రం హెడ్ వెయిట్ కనిపించట్లేదు. అందుకే అమ్మడికి ఇంకా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో మాత్రం ప్రస్తుతం కుబేర సినిమా, పుష్ప 2 (Pushpa 2) సినిమాలు చేస్తున్న రష్మిక గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కూడా నటిస్తుంది.

సౌత్ ఆడియన్స్ రష్మిక ఎక్కువగా ఇక్కడ సినిమాలు చేయాలని అంటున్నా ఆమెకు వస్తున్న బాలీవుడ్ ఆఫర్ల వల్ల కాదనలేక చేస్తుంది. తప్పకుండా రష్మిక అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఇదే ఫాం మరికొన్నాళ్లు కొనసాగిస్తుందని చెప్పొచ్చు.