Site icon HashtagU Telugu

Rashmika-Vijay: మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక, విజయ్.. సంథింగ్ సంథింగ్ అంటూ?

Mixcollage 13 Mar 2024 12 32 Pm 3985

Mixcollage 13 Mar 2024 12 32 Pm 3985

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. అందుకు అనుగుణంగానే రష్మిక విజయ్ ఎప్పటికప్పుడు వాటికి ఆజ్యం పోస్తూ ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడం ఇద్దరు కలిసి ఒకే విధమైన షర్ట్లు వేసుకోవడం లాంటివి చేయడంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

ఇకపోతే గతంలో చాలాసార్లు విజయ్ దేవరకొండ రష్మిక ల ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అంటూ రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు రష్మిక విజయ్ లు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో అభిమానులు వారి రిలేషన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. రష్మిక మందన్న ధరించిన క్యాప్, ఈ ఒక్క క్యాప్ ఇద్దరికీ కొత్త కథ చెబుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా నటి రష్మిక పింక్ కలర్ హ్యాట్ ధరించిన క్యూట్ ఫోటోను షేర్ చేసింది.

అయితే ఈ టోపీ దేవరకొండది. కానీ ఆ టోపీ రష్మిక మందన్న దేవరకొండ టోపీ పెట్టుకుందని నెటిజన్లు అంటున్నారు. వీరిద్దరూ ఒకే క్యాప్ ధరించి ఉన్న ఫొటోను చూసిన నెటిజన్లు.. కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెబుతున్నారు. ఇదెక్కడో చూసినట్లుందే అని ఒక నెటిజన్, ఇది విజయ్ దేవరకొండ క్యాప్ అని మరో నెటిజన్ కామెంట్స్ పోస్ట్ చేశారు. మరి ఈ వార్తలపై రష్మిక మందన విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.