Site icon HashtagU Telugu

Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్.. మరో వివాదంలో రష్మిక

Rashmika

Rashmika

రష్మిక మందన్న (Rashmika Mandanna) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు ప్రమోషన్స్, మరోవైపు వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే కన్నడ పరిశ్రమ నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ మరో వివాదానికి తెరలేపింది. టాలీవుడ్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ (Bollywood) బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రష్మిక (Rashmika Mandanna) సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నులో కనిపించనుంది. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో 19 జనవరి 2023న విడుదలవుతోంది.

ఇద్దరు ప్రధాన నటులు ప్రస్తుతం ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. పాటల ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో నటి తనపై బాలీవుడ్ పాటల ప్రభావం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. మిషన్ మజ్ను పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) బాలీవుడ్ పాటలపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, బాలీవుడ్ పాటలు మరింత రొమాంటిక్ గా ఉన్నాయని చెప్పింది. మరోవైపు (South Industry) దక్షిణాదిలో మాస్, ఐటెమ్ (Mass and Item Songs) సాంగ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పింది.

సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడినందుకు ప్రేక్షకులు ఈ నటిపై ట్రోలింగ్ కు దిగారు. “రష్మిక సౌత్‌లో రొమాంటిక్ సాంగ్స్ లేదని భావిస్తోంది. ఆమె వాస్తవాలు ఎంటో తెలుసుకోవాలి. నిజాలు తెలియకుండా మాట్లాడటం ఆమె మూర్ఖత్వం’’ అని కొందరు కామెంట్స్ చేయగా, “రష్మిక మీకు రెహమాన్ పాటల గురించి తెలియదా? బాలీవుడ్ లోనూ మాస్ ఐటెం సాంగ్స్ ఉన్నాయి’’ అని ఘాటుగా (Trolls) కామెంట్స్ చేశారు మరికొందు నెటిజన్స్.

Also Read: Police Boss: తెలంగాణ పోలీస్ బాస్ ఈయనే?