టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నకు మేనేజర్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమె తన మేనేజర్ చేతిలో ఆర్థిక మోసానికి గురైనట్లు చెప్పింది. మీడియా కథనాల ప్రకారం 80 లక్షల రూపాయల వరకు మోసపోయినట్టు తెలుస్తోంది. రష్మిక తన కెరీర్ ప్రారంభం నుండి తనతో పాటు ఉన్న తన మేనేజర్‌ను వెంటనే తొలగించింది. ఈ ఘటనపై ఆమె ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కారణంగా వెంటనే తన వ్యక్తిగత మేనేజర్ ను తొలగించిందట.
హిందీ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో చివరిసారిగా కనిపించిన రష్మిక, ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. అంతేకాదు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఇవే కాకుండా పలు సినిమాలతో బిజీగా ఉంది రష్మిక.ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక.
ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో మొత్తంగా 38 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక మందన్న. ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది.
Also Read: Komatireddy Brothers: తమ్ముడి ఘర్ వాపసికి అన్న ప్రయత్నం!