Rashmika Mandanna: పెట్ డాగ్ తో రష్మిక వాలంటైన్ సెలబ్రేషన్స్.. విజయ్ ఎక్కడ అంటూ ట్రోల్స్!

ప్రేమికుల రోజున రష్మిక (Rashmika Mandanna) తన పెట్ డాగ్ ఆరాపై ప్రేమను ఒలకబోసి అందర్నీ ఆకట్టుకుంది. 

Published By: HashtagU Telugu Desk
Rashmika

Rashmika

ఇవాళ వాలంటైన్స్ డే. ఈ సందర్భంగా ప్రేమికులు కొందరు రహస్యంగా, మరికొందరు పబ్లిక్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక హీరోహీరోయిన్లు సైతం తమ అభిమానులను వాలంటైన్స్ డే (Lovers Day) గ్రీటింగ్స్ చెప్పారు. ప్రేమకు చిహ్నామైన డ్రస్సులను ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్మిక రష్మిక సైతం లవర్స్ డే వేడుకలను జరుపుకుంటోంది. ప్రేమికుల రోజున రష్మిక (Rashmika Mandanna) తన పెట్ డాగ్ ఆరాపై ప్రేమను ఒలకబోసి అందర్నీ ఆకట్టుకుంది.

‘పుష్ప’ ఫేమ్ రష్మిక మందన్న తన అభిమానులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆరాతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసుకుంది. వీడియోలో రష్మిక (Rashmika Mandanna) ఆరాతో పడుకుని ఆడుకోవడం చూడవచ్చు. “నా వైపు నుండి మీకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే రష్మిక వీడియోపై నెటిజన్స్, ఫ్యాన్స్ ట్రోల్స్ కు దిగారు. లైగర్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రైవేట్ ఫొటోలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో రష్మిక తన కుక్కతో కలిసి వాలంటైన్స్ డే జరుపుకోవడం షాక్ కు గురి చేసింది. విజయ్ దేవరకొండ ఎక్కడ? మీరు కూడా కియారా, సిద్దార్థ్ లాగా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం రష్మిక తదుపరి అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో కనిపించనుంది. ఆమె రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాలో కూడా (Rashmika Mandanna) నటిస్తోంది.

  Last Updated: 14 Feb 2023, 04:40 PM IST