Site icon HashtagU Telugu

Rashmika Mandanna : ఆ దేశంలో రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..

Rashmika Birth Day

Rashmika Birth Day

Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవల పుష్ప 2, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టగా సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక తెలుగులో స్టార్ గా ఎదిగి అనంతరం తమిళ్, ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వైడ్ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక.

నేడు ఏప్రిల్ 5 రష్మిక బర్త్ డే. రష్మిక తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోడానికి ఒమన్ దేశానికి వెళ్ళింది. ఒమన్ దేశంలోని ఓ దీవిలో ఉన్న రెస్టారెంట్ కూర్చొని ఫుడ్ తింటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్ళాడు అని పలువురు అంటున్నారు. ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకే రోజు రష్మిక, విజయ్ కనిపించారని, ఇద్దరూ కలిసే ఒమన్ దేశానికి వెళ్లారని, అక్కడ రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు సమాచారం. విజయ్ – రష్మిక గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నా, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు , వీడియోలు లీక్ అవుతున్నా వీరు మాత్రం అధికారికంగా స్పందించట్లేదు.

ఇక రష్మిక త్వరలో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అనే సినిమాలతో రానుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో తెలుగు, హిందీ కలిపి దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్టు సమాచారం.

 

Also Read : Mahesh Babu : మొత్తానికి రాజమౌళి దగ్గర్నుంచి పాస్ పోర్ట్ లాక్కున్న మహేష్ బాబు.. షూటింగ్ కి బ్రేక్.. వెకేషన్ కి జంప్..