ది విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి సినిమా రిజల్ట్ ఏదైనా తను మాత్రం కాస్త రిలీఫ్ గా ఉన్నాడు. మిగతా సినిమాల్లా ఖుషి అంత వరస్ట్ గా కాకపోయినా సరే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదని అంటుంటారు. ఇక తన నెక్స్ట్ సినిమా పరశురాం (Parasuram) డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా జెర్సీ దర్శకుడు గౌతం తిన్ననూరితో చేస్తున్నాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ముందు శ్రీ లీలని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె డేట్స్ కుదరదని చెప్పేసింది. ఆల్రెడీ హారిక హాసిని బ్యానర్ లో గుంటూరు కారం చేస్తున్న శ్రీ లీల (Sreeleela)ని ఈ సినిమాకు వాడాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు.
Also Read : Bigg Boss 7 : నామినేషన్స్ లో ఫస్ట్ టైం.. ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్..!
శ్రీ లీల ప్లేస్ లో రష్మిక మందన్న వచ్చి చేరిందని వార్తలు వచ్చాయి. అయితే శ్రీ లీల కూడా వరుస కమిట్మెంట్స్ తో బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఒక సినిమా ఓకే చేసింది. దానివల్ల విజయ్ సినిమా చేయాల్సి ఉన్నా ఆఫర్ కి నో చెప్పిందట. విజయ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే రష్మిక (Rashmika) అతని సినిమాకు హ్యాండ్ ఇవ్వడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
రష్మిక ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ (Animal), రెయిన్ బో సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలతో రష్మిక మళ్లీ టాప్ లీగ్ లోకి రావాలని చూస్తుంది.
We’re now on WhatsApp : Click to Join