Site icon HashtagU Telugu

Rashmika Vs Samantha: ఆ విషయంలో సమంతను దాటేసిన రష్మిక.. క్రేజ్ మాములుగా లేదుగా!

Samantha Rashmika

Samantha Rashmika

సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయట హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే.. నెట్టింట్లో మాత్రం హీరోయిన్లదే హవా. తెలుగు హీరోలు, హీరోయిన్లకు నెట్టింట్లో ఓ మాదిరి క్రేజ్ ఉంటుంది. అయితే హీరోయిన్ల విషయంలో నెటిజన్లు మాత్రం మరీ దూకుడుగా ఉంటారు. హీరోయిన్లకు మిలియిన్ల కొద్దీ ఫాలోవర్లు వచ్చిపడుతుంటారు.

అదే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలకు బయట మంచి క్రేజ్ ఉంది. నెట్టింట్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే వీరిలో ఎవ్వరికీ కూడా 20 మిలియన్ల ఫాలోవర్లు లేరు. కానీ హీరోయిన్లకు మాత్రం పదుల మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి పడుతుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు రష్మిక మంద, సమంత, పూజా హెగ్డేల మధ్య పోటీ ఉండేది.

సమంత టాప్ రేంజ్‌లో దూసుకుపోయేది. ఆమెతో పాటుగా పూజా హెగ్డేకు సైతం ఫాలోవర్లు పెరుగుతూ వచ్చేవారు. హీరోయిన్లు హాట్ ఫోటో షూట్లు చేయడం, అందాల ప్రదర్శనతో ఈ రేంజ్ ఫాలోయింగ్, క్రేజ్‌ను తెచ్చుకుంటూ ఉంటారు. ఈక్రమంలోనే సౌత్ నుంచి సమంత, పూజా హెగ్డే, రష్మిక మందనలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీరు కేవలం ఇన్ స్టాగ్రాం నుంచి కొన్ని లక్షలు సంపాదించేస్తుంటారు.

ఇన్ని రోజులు సమంత సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉండేది. కానీ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయింది. అయితే ఈ సమయంలోనే రష్మిక దూసుకుపోయింది. ఇప్పుడు టాప్ ప్లేస్‌లోకి వెళ్లింది. ఆమె 32 మిలియన్ల ఫాలోవర్లతో ముందంజలో ఉండగా.. సమంత మాత్రం 24.3 వద్దే ఆగిపోయింది. నాగ చైతన్యతో విడాకుల వల్ల సమంతకు కాస్త ఇమేజ్ తగ్గినట్టు అనిపిస్తోంది.

Exit mobile version