Rashmika Mandanna : రష్మిక ఏంటి.. ఆనంద్ దేవరకొండని అంత మాట అనేసింది..!

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నకి ఉన్న సంబంధం ఏంటో తెలియడం లేదు గాని, రష్మిక మాత్రం విజయ్ ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా కలిసిపోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Rashmika Mandanna Anand Deverakonda Conversation In Gam Gam Ganesha Event Gone Viral

Rashmika Mandanna Anand Deverakonda Conversation In Gam Gam Ganesha Event Gone Viral

Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నకి ఉన్న సంబంధం ఏంటో తెలియడం లేదు గాని, రష్మిక మాత్రం విజయ్ ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా కలిసిపోతున్నారు. విజయ్ కుటుంబంతో మంచి సంబంధాలు మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఆనంద్ సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు.

గతంలో ‘బేబీ’ మూవీ ఈవెంట్ కి వచ్చి ఆనంద్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన రష్మిక.. రీసెంట్ గా ‘గం గం గణేశా’ మూవీ ఈవెంట్ కి కూడా గెస్ట్ వచ్చి సందడి చేసారు. ‘గం గం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మికని ఆనంద్ దేవరకొండ పలు ప్రశ్నలు అడిగారు. ఇక వాటికీ రష్మిక ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి.

ముందుగా రష్మిక పెట్ డాగ్ ‘ఆరా’, విజయ్ దేవరకొండ పెట్ డాగ్ ‘స్టార్మ్’ పిక్స్ ని చూపిస్తూ.. వాటిలో ఏది మీ ఫేవరెట్ అని ప్రశ్నించారు. దానికి రష్మిక బదులిస్తూ.. ఆరా నా ఫస్ట్ బేబీ, స్టార్మ్ నా సెకండ్ బేబీ అని చెప్పుకొచ్చారు. అనంతరం నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరని ఆనంద్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా. ఇలా స్పాట్ లో పెడితే ఎలా. సరిలే రౌడీ బాయ్ నా ఫేవరేట్” అంటూ విజయ్ దేవరకొండని ఉద్దేశించి చెప్పింది.

అయితే రష్మిక ఈ జవాబు ఇవ్వడానికంటే ముందు మైక్ పక్కన పెట్టి ఆనంద్‌ని.. నీ అబ్బా అని తిట్టేసారు. ఇది గమనించిన నెటిజెన్స్.. ఏంటి రష్మిక అంత మాట అనేసింది. రష్మిక విజయ్ ఫ్యామిలీతో అంత క్లోజ్ అయ్యిపోయిందా..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

  Last Updated: 28 May 2024, 06:14 PM IST