Site icon HashtagU Telugu

Rashmika Mandanna : సినిమాకు సైన్ చేసే ముందు వాటిని కచ్చితంగా చూస్తా అంటున్న రష్మిక..!

Rashmika Another Bollywood Crazy Offer

Rashmika Another Bollywood Crazy Offer

Rashmika Mandanna ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ లో కచ్చితంగా రష్మిక మందన్న పేరు ఉంటుంది. మొన్నటిదాకా తెలుగు తమిళ భాషల్లో తన టాలెంట్ చూపించిన అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో అదరగొట్టేస్తుంది. హిందీలో మొదటి రెండు సినిమాలు జస్ట్ ఓకే అనిపించగా యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడి రేంజ్ డబుల్ అయ్యింది.

త్వరలో పుష్ప 2 తో రాబోతున్న రష్మిక ఆ సినిమాతో కూడా మరోసారి సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది. అయితే లేటెస్ట్ గా తను ఒక సినిమాకు సైన్ చేయాలంటే ఏయే యాస్పెక్టులు చూస్తుందో బాలీవుడ్ మీడియాకు వెళ్లడింది. తాను ఒక సినిమాకు సైన్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ని తీక్షణంగా వింటానని చెప్పింది రష్మిక.

అంతేకాదు పాత్ర నచ్చితే వెంటనే సినిమాకు ఓకే చెబుతానని అన్నది. అంతేకాదు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అయితే తాను ఓకే చెబుతానని.. అన్ని సినిమాలు అలా సాధ్యం కాకపోయినా మల్టిపుల్ జోనర్ లో ఏదో ఒక విధంగా సోషల్ మెసేజ్ ఉంటే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని అలాంటి సినిమాలకు తాను సైన్ చేస్తానని అంటుంది అమ్మడు. అలా కథల మీద తను ఎంచుకునే పాత్రల మీద క్లారిటీ ఉంది కాబట్టే రష్మిక ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు.

Also Read : Hit 3 Nani : హిట్ 3 నాని కండీషన్స్ కి డైరెక్టర్ షాక్..!