Rashmika కన్నడ భామ రష్మిక మందన్న గత రెండేళ్లు కొద్దిగా కెరీర్ లో వెనకపడి నట్టు అనిపించినా మళ్లీ తిరిగి పుంజుకుంటుంది. బాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అమ్మడు అక్కడ సినిమా ఛాన్స్ రాగానే ఎగ్జైట్ అయిన ఈ అమ్మడు చేసిన సినిమాలేవి వర్క్ అవుట్ కాకపోవడంతో డీలా పడింది. ఇక తనకు స్టార్డం ఇచ్చిన టాలీవుడ్ నుంచి కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) తో పాటుగా రణ్ బీర్ కపూర్ తో యానిమల్ (Animal) సినిమా చేస్తుంది రష్మిక. దీనితో పాటు రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమా కూడా చేస్తుంది. రణ్ బీర్ (Ranbhir Kapoor) యానిమల్ తర్వాత అమ్మడి ఫేట్ మారబోతుందని తెలుస్తుంది. సందీప్ వంగ డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ మారుతుందని అంటున్నారు.
Also Read : Baby Block Buster : బుల్లితెర మీద బేబీ బ్లాక్ బస్టర్..!
అందుకోసమే రష్మిక (Rashmika) ఇప్పుడు తన రెమ్యునరేషన్ మరో కోటి పెంచేసిందని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు 3 నుంచి 4 కోట్ల దాకా తీసుకుంటున్న రష్మిక ఇప్పుడు సినిమాకు ఐదు కోట్లు ఇవ్వాల్సిందే అంటుందట. నేషనల్ క్రష్ గా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది కాబట్టి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకోవాలని చూస్తుంది.
తెలుగులో నితిన్ వెంకీ కుడుముల సినిమాను ముందు ఓకే చెప్పి తర్వాత కాదన్న రష్మిక మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమాలో కూడా రష్మికని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కడంతో రష్మిక రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటుందని టాక్.
We’re now on WhatsApp. Click to Join