కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఈమధ్యనే అమరన్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. మేజర్ ముకున్ వరదరాజన్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan), సాయి పల్లవి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే శివ కార్తికేయన్ కెరీర్ లో అమరన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అమరన్ తర్వాత శివ కార్తికేయన్ శిబి చక్రవర్తి (Sibi Chakravarthi) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ఎంపికైనట్టు తెలుస్తుంది.
శిబి చక్రవర్తితో శివ కార్తికేయన్ ఆల్రెడీ డాన్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే హిట్ కాంబో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అమరన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ నెక్స్ట్ సినిమాతో కూడా అదే భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్స్ తో శివ కార్తికేయన్..
ఈ సినిమాలో రష్మిక (Rashmika) నటించడం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ అమరన్ లో సాయి పల్లవితో నటించాడు ఆ సినిమా సూపర్ హిట్ కాగా వెంటనే నెక్స్ట్ సినిమాలో రష్మికతో జత కడుతున్నాడు. వరుస స్టార్ హీరోయిన్స్ తో శివ కార్తికేయన్ అదిరిపోయే ప్లాన్ వేశాడని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ శిబి చక్రవర్తి సినిమాకు రష్మిక కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అవుతుందని చెప్పొచ్చు.
ఆల్రెడీ పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తున్న రష్మిక పుష్ప 2 తో మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుతం అమ్మడు ధనుష్ కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాల్లో నటిస్తుంది.
Also Read : Vijay Devarakonda Pushpa 3 : పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఉన్నాడా..?