Site icon HashtagU Telugu

Rashmika Hand Injury : రష్మిక కు ఏమైంది..? చేతికి ఆ కట్టు ఏంటి..?

Rashmika Injury

Rashmika Injury

నేషనల్ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna) చేతికి కట్టు (Hand Injury) చూసి అభిమానులు ఆమెకు ఏమైందని ఆరా తీస్తున్నారు. మొన్న పుష్ప 2 సాంగ్ రిలీజ్ వేడుకలో బాగానే ఉంది కదా..సడెన్ గా ఆమె చేతికి ఏమైందంటూ అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ (AlluArjun) – రష్మిక కలయికలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 05 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని యావత్ అభిమానులు , సినీ ప్రముఖులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ అన్ని భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.

పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక విమానంలో కేరళకు చేరుకున్నారు. కాగా విమానంలో రష్మిక, అల్లు అర్జున్ కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ ఫొటోల్లో రష్మిక చేతికి పట్టీ వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆమెకు గాయం ఎలా అయ్యిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. మరి నిజంగా ఆమె చేతికి గాయమైంది..? లేక ఊరికే ఆలా వేసుకుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ‘పుష్ప 2′ మూవీ గ్రాండ్ ఈవెంట్ మొదలైంది. అంతకు ముందు అల్లు అర్జున్ కొచ్చి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఫ్యాన్స్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆయనను కలిసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ఇదిలా ఉంటె ..’పుష్ప-2’ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా, ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 30 లేదా డిసెంబర్ 1న బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీ సేల్ ఇప్పటికే యూఎస్లో మొదలైంది.

Read Also : TDP : కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీల నేతలు క్రమశిక్షణతో ఉండాలి: సీఎం సూచన