Site icon HashtagU Telugu

Rashmika Mandanna: యానిమల్ సక్సెస్ తో రష్మికకు బాలీవుడ్ ఆఫర్లు

Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna: “యానిమల్” భారీ విజయం నటుడు రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు మరింత ప్లస్ అయ్యింది. “యానిమల్” కంటే ముందు రెండు హిందీ చిత్రాలలో కనిపించినప్పటికీ, ఈ చిత్రం ఆమెను బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించేలా చేసింది.

అగ్ర నిర్మాణ సంస్థలు, దర్శకుల నుండి ఆమెకు మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయని సినీ క్రిటిక్స్ అంటున్నారు. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. రష్మికకు పరిశ్రమలోని ప్రముఖ చిత్రనిర్మాతల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, వారి చిత్రాలకు సైన్ చేయడానికి  కూడా సంప్రదించారు. దీంతో రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ గా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పుష్ప మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన రష్మిక యానిమల్ మూవీతో ఆకట్టుకుంది.

Also Read: Guntur Kaaram: పాటల పల్లకీలో గుంటూరు కారం, సెకండ్ సింగిల్ కు రెడీ