రష్మిక డీప్ ఫేక్ వీడియో (Rashmika Fake Video) ఫై సినీ స్టార్స్ (Film Stars) మాత్రమే రాజకీయ నేతలు (Political Leaders) సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మరోసారి..మరెవరు చెయ్యకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గీత గోవిందం (Geetha Govindam) మూవీ తో ఎంతో ఫేమస్ అయినా రష్మిక..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో స్టార్ గా గుర్తింపు సాధించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండగా..మూడు రోజులుగా ఓ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. నిజంగా రష్మిక లాగే ఉండడంతో మరింత వైరల్ గా మారింది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ (Zara Patel) కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ విషయం పై ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Big B) స్పందించి మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఆ వెంటనే నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ మరియు మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
విజయ్ దేవరకొండ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఇలాంటి ఘటన ఇంకొకరికి జరగకూడదు.. డీప్‌ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.. వెంటనే వారిని శిక్షించాలి.. అప్పుడు మహిళలు రక్షించబడతారు అని విజయ్ తెలిపాడు.
గీత గోవిందం , డియర్ కామ్రేడ్ మూవీస్ లలో నటించారు. మొదటి సినిమా నుండే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పటికి వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లడం..కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే వీరి మధ్య ప్రేమ నడుస్తుందని చాలామంది అంటుంటారు. కానీ వీరు మాత్రం ఫ్రెండ్స్ అనే చెపుతున్నారు. మరి వీరి మధ్య ఉన్నదో స్నేహమో , ప్రేమో వారికీ తెలియాలి. ఏది ఏమైనప్పటికి రష్మిక ఫేక్ వీడియో మాత్రం విజయ్ లో ఆగ్రహం తెప్పించింది.
Read Also : Rekha Naik : కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్