Rashmika నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను తన టాలెంట్ తో సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో ఒక రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో తిరిగు లేని ఇమేజ్ ని సాధించింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 (Pushpa 2), కుబేర, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తున్న రష్మిక అటు బాలీవుడ్ లో కూడా ఛావా సినిమాలో ఛాన్స్ అందుకుంది.
విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున ఈ ఛావా సినిమా మరాఠి మహరాజ్ ఛత్రపతి శివాజి కథతో వస్తుంది. సినిమాలో రష్మిక రాణిగా కనిపించనుంది. ఐతే ఈ సినిమా కోసం మరాఠి (Marathi) భాషను నేర్చుకుని మరి నటిస్తుందట రష్మిక. సినిమాను హిందీ, మరాఠి భాషల్లో తెరకెక్కిస్తుండగా పాత్రను అర్ధం చేసుకునేందుకు మరాఠి భాష నేర్చుకుంటుందట రష్మిక.
ఈమధ్య కాలంలో ప్రతి హీరోయిన్ తాము నటిస్తున్న భాష మీద పట్టు సాధించాలని చూస్తున్నారు. అందుకే ప్రతి హీరోయిన్ ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ప్రతి హీరోయిన్ కూడా ముందు ఇక్కడ భాష నేర్చుకుని సొంత డబ్బింగ్ చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాను ఇంకాస్త ఓన్ చేసుకున్న భావన కలుగుతుంది.
ఇటు తెలుగులో కూడా రష్మిక సొంత డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. రష్మికకు ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి తెలుగు సినిమాలే రీజన్ అని చెప్పొచ్చు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ ఆఫర్స్ అందుకుంది. వాటితో కూడా సూఅప్ర్ హిట్ కొట్టడంతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది.
ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ఫాం కొనసాగిస్తుంది అమ్మడు. ఛావా సినిమా రష్మిక కెరీర్ లో స్పెషల్ మూవీ అన్నట్టు చెబుతుంది. సినిమా మీద అమ్మడు చాలా హోప్స్ పెట్టుకున్నట్టు అర్ధమవుతుంది.