Site icon HashtagU Telugu

Rashmika Mandanna : హీరోని చెంపదెబ్బ కొట్టి బోరున ఏడ్చేసిన హీరోయిన్..!

Rashmika 69th Filmfare Awar

Rashmika 69th Filmfare Awar

మొన్నటిదాకా టాలీవుడ్ లో ఫాం కొనసాగించిన కన్నడ భామ రష్మిక (Rashmika Mandanna) ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. రష్మిక నటించిన మొదటి రెండు బాలీవుడ్ సినిమాలు అంతగా ప్రభావితం చూపించలేదు కానీ రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా మాత్రం ఆమె రేంజ్ పెంచింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యానిమల్ సినిమాలో రష్మిక నటన ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించిన రష్మిక ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ సినిమాలో ఆమె చేసిన ఒక సీన్ ఆమెను నిజంగానే ఏడ్చేలా చేసిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక. రన్ విజయ్, గీతాంజలి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది. రష్మిక రణ్ బీర్ ని చెంప మీద కొట్టే సీన్, ఆ సీన్ లో రష్మిక రణ్ బీర్ ని చెంప మెద కొట్టి ఆ సీన్ చేసి సీన్ అయిపోయాక ఏడ్చేసిందట. సీన్ లో తాను అంతగా ఇన్వాల్వ్ అయ్యానని చెప్పుకొచ్చింది రష్మిక. యానిమల్ సినిమాలో నటించడం ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పిన రష్మిక రాబోతున్న పుష్ప 2 సినిమాపై కూడా అంచనాలు పెంచింది.

పుష్ప 2 (Pushpa 2) సినిమాలో తన పాత్ర మరోసారి అలరిస్తుందని. సినిమాకు ఈమధ్యనే ఒక సాంగ్ పూర్తి చేశామని అన్నది రష్మిక. పుష్ప 2 హిట్ విషయంలో డౌట్ పడేది లేదని సుకుమార్ (Sukumar) ఆడియన్స్ అంచనాలను మించి సినిమాను తెరకెక్కిస్తున్నారని అన్నది. బాలీవుడ్ లో రష్మిక సూపర్ ఫాం కొనసాగిస్తుంది. ఆమె చేస్తున్న సినిమాలు అక్కడ భారీ హిట్ సాధిస్తున్నాయి. ఆల్రెడీ యానిమల్ తో బంపర్ హిట్ కొట్టిన రష్మిక త్వరలో పుష్ప 2 తో మరో సెన్సేషనల్ హిట్ టార్గెట్ పెట్టుకుంది.

Also Read : Mahesh Rajamouli Movie : ఏడాదిలో పూర్తి చేయడం సాద్యమయ్యే పనేనా..!

ఈ సినిమా తర్వాత రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవింద్రన్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ ఫాలోయింగ్ ఏరపచుకుంది. ఆమె చేస్తున్న సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో అమ్మడు నేషనల్ వైడ్ మరింత క్రేజ్ సంపాధించింది. రానున్న సినిమాలతో మళ్లీ అమ్మడు టాప్ లేపేస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రష్మిక చూపిస్తున్న ఈ ఫాం మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇస్తుంది.