నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది. అమ్మడు ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తుండగా పుష్ప 2 హిట్ తో మరో సారి తన పాపులారిటీ మోత మోగిపోయేలా చేసింది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో రష్మిక కు బాలీవుడ్ లో భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్న రష్మిక (Rashmika Mandanna) మరో లక్కీ ఆఫర్ కూడా అందుకుంది.
ఇప్పటికే బాలీవుడ్ (Bollywood) లో సల్మాన్ తో సికందర్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఇప్పుడు మరో ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కాక్ టెయిల్ 2లో రష్మిక అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మికకు లక్కీ ఛాన్స్ వచ్చింది.
సైఫ్ అలీ ఖాన్ కి సూపర్ హిట్..
కాక్ టెయిల్ సినిమా సైఫ్ అలీ ఖాన్ కి సూపర్ హిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో షాహిద్ కి జతగా రష్మిక నటించనుంది. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ లో మరింత స్ట్రాంగ్ అవ్వనుంది. యానిమల్ హిట్ తోనే రష్మికౌ వరుస ఆఫర్లు వస్తుండగా పుష్ప 2 (Pushpa 2) కూడా సూపర్ హిట్ పడటంతో ఇక తిరిగు లేకుండాపోయింది.
కచ్చితంగా బాలీవుడ్ లో రష్మిక అందుకుంటున్న ఆఫర్లు చూస్తుంటే అమ్మడు టాప్ ప్లేస్ కి వెళ్లేలా ఉంది. ఐతే హిందీలో బిజీ అయ్యాం కదా అని సౌత్ సినిమాలను రిజెక్ట్ చేయకుండా ఇక్కడ కూడా వరుస సినిమాలు చేస్తుంది అమ్మడు.