Rashmika : పెళ్లి చేసుకున్నట్లు తెలిపి షాక్ ఇచ్చిన రష్మిక

నేను నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు

Published By: HashtagU Telugu Desk
Rashmika about Wedding

Rashmika about Wedding

పెళ్లి ఎప్పుడు రష్మిక అంటే..అదేంటి నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న కదా..అని సమాధానం ఇచ్చి మైండ్ బ్లాక్ చేసింది శ్రీవల్లి. గీత గోవిందం మూవీ తో తెలుగు లో అడుగుపెట్టిన రష్మిక..మొదటి మూవీ తోనే అందర్నీ కట్టిపడేసింది. ఆ తర్వాత అమ్మడు వెనుకకు చూసుకోవాల్సిన పనిలేకుండా వరుస సినిమా ఛాన్సులు తలుపుతట్టాయి. అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ప్రస్తుతం తెలుగు తో పాటు హిందీ , తమిళ్ చిత్రాలతో ఫుల్ బిజీ గా ఉంది. తెలుగు లో పుష్ప 2 చేస్తుంది. ఈ మూవీ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా డీ గ్లామర్ రోల్ లో రష్మిక అదరగొట్టింది.

ప్రస్తుతం ఈమె (Rashmika ) బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా వారు మీరు ఎప్పుడు పెళ్లి (Rashmika Wedding) చేసుకుంటారని ప్రశ్నించగా..దానికి ఏమాత్రం మొహమాటపడకుండా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. నేను నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు అని చెప్పి షాక్ ఇచ్చింది. నరుటో అంటే ఎనిమీ సిరీస్‌లోని ఒక పాత్ర. ఆ పాత్ర కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కూడా ఆ పాత్రకు పెద్ద ఫ్యాన్ అట. అందుకే నరుటో తో పెళ్లి అయ్యిందని తెలిపి హమ్మయ్య అనిపించింది.

వాస్తవానికి కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి వరకు వెళ్లలేదు. కెరియర్ అప్పుడే స్టార్ట్ అవుతుండడం తో పెళ్లి చేసుకుంటే కెరియర్ కు ఇబ్బందని భావించి ఆ పెళ్లి రద్దు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం అమ్మడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో క్లోజ్ గా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నప్పటికీ..వారు మాత్రం జస్ట్ మీము ఫ్రెండ్స్ అని చెపుతూ వస్తున్నారు. మరి నిజంగా స్నేహితులేనా..లేక ప్రేమ పక్షుల అనేది త్వరలో బయటపడుతుంది.

Read Also : Vani Kapoor : ఇండియా కోచర్ వీక్ లో లెహంగా లో మెరిసిన వాణి కపూర్

  Last Updated: 03 Aug 2023, 03:38 PM IST