Site icon HashtagU Telugu

Rashmi Gautham : కుర్చి మడతపెట్టి.. ఈ వార్తలను నమ్మొద్దంటున్న జబర్దస్త్ యాంకర్..!

Rashmi Gautham Respond About Mahesh Babu Kurchi Madatapetti Song Offer

Rashmi Gautham Respond About Mahesh Babu Kurchi Madatapetti Song Offer

Rashmi Gautham సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. థమన్ మ్యూజిక్ అదరగొట్టేయగా ఆ సాంగ్ లో మహేష్ డాన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించింది. ఇక శ్రీ లీల డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ సాంగ్ లో పూర్ణ లీడ్ తెలిసిందే. సాంగ్ మొదట్లో పూర్ణ తన డాన్స్ తో అలరిస్తుంది. అయితే ఆ సాంగ్ ఆఫర్ ముందు జబర్దస్త్ యాంకర్ రష్మిని అడిగితే ఆమె కాదనడం వల్ల పూర్ణకి ఇచ్చారని కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే వీటిపై కొందరు నెటిజెన్లు రష్మిని ట్యాగ్ చేసి కామెంట్ చేయగా ఫైనల్ గా రష్మి ఈ విషయంపై స్పందించింది. అసలు గుంటూరు కారం కి సంబందించిన ఎలాంటి సాంగ్ ఆఫర్ తనకు రాలేదని.. ఆ చిత్ర యూనిట్ ఎవరు తనని సంప్రదించలేదని అన్నారు రష్మి. అంతేకాదు ఆ రోల్ కి పూర్ణనే పర్ఫెక్ట్ ఆమె పూర్తి న్యాయం చేశారు. దయచేసి ఇలాంటి వార్తలను ప్రోత్సహించకండి అంటూ ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది.

తన గురించి ఎవరు ఎలాంటి కామెంట్ పెట్టినా.. తన గురించి ఎవరు ఎలాంటి వార్తలు రాసినా సరే వెంటనే స్పందిన్స్తుంది రష్మి గౌతం. గుంటూరు టాకీస్ లో చేసిన ఆమె గుంటూరు కారం సినిమాలో తనకు అసలు ఛాన్స్ రాలేదని. అలాంటిది తాను ఎలా చేస్తానని అంటుంది. అంతేకాదు కుర్చీ మడతపెట్టి సాంగ్ లో పూర్ణ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారని ఆమె రాసుకొచ్చారు.

సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం సినిమా మంచి సక్సెస్ అందుకోగా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో కూడా డిజిటల్ రిలీజైంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా గుంటూరు కారం అదరగొట్టేస్తుంది. నెట్ ఫ్లిక్స్ టాప్ 1 గా ట్రెండింగ్ లో ఉంటుంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా మహేష్ స్టామినా చూపించే విధంగా గుంటూరు కారం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.