Rashi Khanna : అందాల భామ రాశి ఖన్నా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. తెలుగులో ఐడెంటిటీ వచ్చినా కూడా ఎందుకో దాన్ని సరిగా వాడుకోలేకపోయిందని చెప్పొచ్చు. మద్రాస్ కేఫ్ తో తెరంగేట్రం చేసిన అమ్మడు టాలీవుడ్ (Tollywood) లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి యంగ్ హీరోలతో కలిసి నటిస్తూ అలరిస్తుంది.
ఐతే స్టార్ మెటీరియల్ అయినా కూడా రాశి ఖన్నాకు ఏమాత్రం లక్ ఫేవర్ చేయలేదు. ఎన్టీఆర్ (NTR), రవితేజ లాంటి స్టార్స్ తో నటించినా సరే ఎందుకో రాశి ఖన్నా స్టార్ రేంజ్ కి వెళ్లలేదు. ఐతే సినిమాలు, సీరీస్ లు ఎలా ఉన్నా కూడా అమ్మడు తన ఫోటో షూట్స్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. లేటెస్ట్ గా రాశి ఖన్నా గ్లామర్ ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
అటెన్షన్ ని గ్రాబ్ చేయాలని..
గ్లామర్ షో విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. రాశి ఖన్నా ఫోటో షూట్ చూస్తే అమ్మడి స్టైల్ అర్ధమవుతుంది. ఫాలోవర్స్ కి కావాల్సింది అందిస్తూ వారి అటెన్షన్ ని గ్రాబ్ చేయాలని చూస్తుంది అమ్మడు. కచ్చితంగా రాశి కాస్త సీరియస్ గా ట్రై చేస్తే ఇప్పటికి కూడా అమ్మడికి మంచి ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.
రాశి ఖన్నా ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఆమె ఫోటో షూట్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.