టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర హీరోలు పాన్ ఇండియా (Pan India) అంటూ దూసుకుపోతున్న సమయంలో మహేశ్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే మహేశ్ పర్సనల్ (Personal) విషయాలు తెలుసుకోవాలని ఆయన అభిమానులకే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్ కు ఉంటుంది. మహేశ్ అప్పుడప్పుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు.
ఇటీవల ఈ టాలీవుడ్ స్టార్ ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం ఆసక్తికర విషయాలను రివీల్ చేశాడు. ఆ సమయంలో నటుడు తన గురించి, అతని కుటుంబం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ‘రాపిడ్ ఫైర్’ ఛాలెంజ్ రౌండ్‌లో (Rapid Fire) ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన ప్రాంతాలు, తన నిక్ నేమ్, ఫ్యామిలీతో బాండింగ్, ఖాళీ సమయంలో ఏం చేస్తారు? లాంటి ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు మహేశ్ బాబు.
ర్యాపిడ్ ఫైర్
మహేశ్ కాకుండా మరో ఇష్టమైన పేరు?
నాని
మీ బిగ్గెస్ట్ ఫియర్
దర్శకుల అంచనాలను అందుకోవడానికి చాలా ఎఫెర్ట్ పెట్టాల్సి ఉంటుంది
ఖాళీగా ఉంటే ఏం చేస్తారు?
చాలా అల్లరి చేస్తాను, ఫన్నీగానూ ఉంటాను. ఇంట్లో నేను ఎలా ఉంటానో నా భార్య, పిల్లలకు మాత్రమే తెలుసు
ఇప్పటివరకు చేయని సాహాసం
బంగీ జంప్
మీ గురించి మీరు పొగుడుకోవాలనుకుంటే?
బ్యూటిఫుల్
ఏదైనా సినిమా చూస్తూ ఏడ్చిన సందర్భాలున్నాయా?
లయన్ కింగ్. ఆ మూవీ చూసేటప్పుడు చాలా ఎమోషన్ అయ్యాను
మీ సినిమాలో మీకు ఇష్టమైన మూవీ?
ఒక్కడు
మీ ఆల్ టైమ్ ఫెవరేట్ మూవీ?
ఐ థింక్ నాన్నగారి మూవీ. అల్లూరి సీతారామరాజు నా ఫెవరేట్ మూవీ
ఇండియాలో ఇష్టమైన ఫుడ్?
సౌంతిండియా ఫుడ్.. ఇష్టమైన రెస్టారెంట్ హైదారాబాద్ లోనే ఉంది.
Also Read: Samantha Looks: హాలీవుడ్ హీరోయిన్ లా సమంత ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!