Site icon HashtagU Telugu

Ranya Rao: స్మగ్లర్లతో సావాసం.. ఒక్క ట్రిప్ కి లక్షలు.. రన్యారావు కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు!

Ranya Rao

Ranya Rao

తాజాగా నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా ఈ విషయం ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. దానికి తోడు ఆమె డిజిపి కూతురు అని చెప్పడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారింది.. ఇది ఇలా ఉంటే ఈ విషయంలో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యా రావు కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావుకు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావును డీఆర్‌ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్‌ పోలీస్‌ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావును బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయం లోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది.

డీఆర్‌ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావుకు రూ.5 లక్షలు కమీషన్‌ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌ తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌ లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావు బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావు వాడుతున్న బ్యాంక్‌ అకౌంట్‌ మొబైల్‌ ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారట. ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఒక రాజకీయ నాయకుడి సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్‌ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.