ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!

ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Ranveer Dhurandhar

Ranveer Dhurandhar

Dhurandhar: రణవీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ చిత్రం 2025లో ప్రతిష్టాత్మకమైన రూ. 1,000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం 21 రోజుల్లోనే ఈ భారీ మైలురాయిని అధిగమించిన ఈ సినిమా కేవలం ఒకే భాషలో (హిందీ) విడుదలయ్యి ఈ ఘనత సాధించడం విశేషం.

రికార్డులు- విశేషాలు

రూ. 1,000 కోట్ల మైలురాయిని దాటిన తొలి భారతీయ ‘A’ రేటెడ్ చిత్రం ఇదే. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన తొమ్మిది భారతీయ చిత్రాల జాబితాలో (దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్, కల్కి 2898 AD, పుష్ప 2) ధురంధర్ కూడా చేరింది. హిందీ సినిమాలకు ప్రధాన మార్కెట్ అయిన గల్ఫ్ దేశాలలో ఈ సినిమా నిషేధించబడినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో సినిమాలకు కరువైన ‘రిపీట్ ఆడియన్స్’ (మళ్లీ మళ్లీ సినిమా చూసే ప్రేక్షకులు) ఈ చిత్రానికి భారీగా పెరిగారు.

Also Read: పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

వసూళ్ల వివరాలు

ఇండియాలో ఈ మూవీ రూ. 789.18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, నెట్ వసూళ్లు రూ. 668.8 కోట్లుగా నమోదయ్యాయి. ‘స్త్రీ 2’ రికార్డులను అధిగమించి, భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఒరిజినల్ హిందీ చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ. 217.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్ పార్ట్ 2: రివెంజ్’ వచ్చే ఏడాది మార్చి 19, 2026న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

  Last Updated: 26 Dec 2025, 07:02 PM IST