Ranveer Singh Nude Photo: అంతా తూచ్…ఆ ఫోటో నాది కాదు..ఎవరో మార్ఫింగ్ చేశారు.!!

ఓ అమెరికన్‌ మ్యాగజైన్‌ కోసం న్యూడ్‌ ఫోటోషూట్‌ చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ కు ఎదురైన కష్టాలు తక్కువేమీ కావు.

  • Written By:
  • Updated On - September 15, 2022 / 12:00 PM IST

ఓ అమెరికన్‌ మ్యాగజైన్‌ కోసం న్యూడ్‌ ఫోటోషూట్‌ చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ కు ఎదురైన కష్టాలు తక్కువేమీ కావు. ఈ మధ్యే ముంబైలోని చెంబూర్‌లో రణ్‌వీర్ సింగ్‌పై అసభ్యకరమైన ప్రచారం, ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు FIRకూడా నమోదైంది. ఈ కేసులో ముంబై పోలీసులకు రణవీర్ తన వాంగ్మూలం ఇచ్చాడు.

తన ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు రణ్ వీర్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 29 న ముంబై పోలీసులకు రణవీర్ సింగ్ ఫొటోపై ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రణవీర్ ను విచారణకు పిలిచారు. తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసిన 7 ఫొటోలలో ఈ ఫొటోలేదని రణవీర్ పోలీసులకు వెల్లడించారు. ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారన్నారు. రణవీర్ సింగ్ ఫోటోషూట్ కు సంబంధించిన అన్ని ఫోటోలు పోలీసులకు అందజేశారు.