Ranveer Singh : ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు తీసేసిన రణ్‌వీర్.. కారణం ఏంటి..?

రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి సడన్ గా తన పెళ్లి ఫోటోలను తీసేసారు. రణ్‌వీర్ అండ్ దీపికా మధ్య..

Published By: HashtagU Telugu Desk
Ranveer Singh Removes His Wedding Photos With Deepika Padukone In Instagram

Ranveer Singh Removes His Wedding Photos With Deepika Padukone In Instagram

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆరేళ్ళ పాటు దాంపత్య జీవితం గడిపిన ఈ జంట.. ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ గుడ్ న్యూస్ ని రణ్‌వీర్ అండ్ దీపికా అందరికి తెలియజేసారు. దీంతో అభిమానులంతా.. జూనియర్ రణ్‌వీర్ వస్తాడా..? లేదా జూనియర్ దీపికా రాబోతోందా..? అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈమధ్యలో రణ్‌వీర్ అభిమానులకు ఒక ఝలక్ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి సడన్ గా తన పెళ్లి ఫోటోలను తీసేసారు. పాత ఫొటోలతో పాటు మ్యారేజ్ పిక్స్ ని కూడా రణ్‌వీర్ తన ఇన్‌స్టా ప్రొఫైల్ నుంచి తొలిగించారు. వాటిని డిలీట్ చేసారా..? లేదా ఆర్చివ్ చేసారా..? అనేది తెలియదు. కాగా ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న స్టార్ కపుల్స్ అంతా.. ముందుగా ఇలానే సోషల్ మీడియాలో ఫోటోలు తొలిగిస్తున్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే రణ్‌వీర్ కూడా తొలిగించారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పేరెంట్స్ కాబోతున్న సమయంలో ఈ ట్విస్ట్ ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఎందుకంటే, రణ్‌వీర్ కేవలం తన ఓల్డ్ పిక్స్ ని మాత్రమే తొలిగించారు. దీపికాతో ఉన్న న్యూ పిక్స్.. ఇంకా రణ్‌వీర్ ప్రొఫైల్ లోన్ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి రణ్‌వీర్ అండ్ దీపికా మధ్య టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏం లేదని తెలుస్తుంది. కాగా ఈ ఇద్దరు వచ్చే సెప్టెంబర్ నాటికి తమ లైఫ్ లోకి ఒక బేబీని ఆహ్వానించబోతున్నారు. మరి ఈ స్టార్ కపుల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేది ప్రిన్స్..? ప్రిన్సెస్..? అనేది వేచి చూడాలి.

  Last Updated: 08 May 2024, 10:07 AM IST