Site icon HashtagU Telugu

Ranveer Singh : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రణ్‌వీర్ విలన్.. ‘బ్రహ్మరాక్షస’ సినిమా టైటిల్..!

Ranveer Singh Prasanth Varma Movie Titled As Brahmarakshasa

Ranveer Singh Prasanth Varma Movie Titled As Brahmarakshasa

Ranveer Singh : హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ లోకి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ని కూడా తీసుకు వస్తున్నారనే వార్త.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ కంటే ముందే ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇక ఈ వార్త బయటకి వచ్చిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఒకటే సందేహం. ఈ సినిమాతో ఏ హిందూ పురాణపాత్రని సూపర్ హీరోగా ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారని ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ నెలకుంది.

అయితే ఈ సినిమాతో సూపర్ హీరోని కాకుండా సూపర్ విల్లన్ ని పరిచయం చేయబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. ఈ సినిమాకి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ ని పెట్టినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మరాక్షస అంటే హిందూ పురాణాలలో దుర్మార్గపు రాక్షుడిగా చెబుతారు. అలాంటి పాత్ర పేరుని సినిమా టైటిల్ గా పెట్టడంతో.. ఇది సూపర్ విలన్ కి సంబంధించిన కథా అనే డౌట్ కలుగుతుంది. అలాగే రణ్‌వీర్ ఈ సూపర్ హీరో సినిమాటిక్ యూనివెర్స్ కి సూపర్ విలన్ కాబోతున్నారా అనే సందేహం వస్తుంది.

మరి ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. కాగా ఈ మూవీని ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా లాంచ్ చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ని కూడా అలానే సైలెంట్ గా పూర్తీ చేసి 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతే.. జై హనుమాన్ ని మొదలు పెట్టనున్నారట. కాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ తో పాటు ‘అధీర’ అనే మరో సూపర్ హీరో సినిమాని కూడా స్టార్ట్ చేసారు. కానీ అది ఎక్కడి వరకు వచ్చిందో అనేది తెలియడం లేదు.

Also read : Maa Oori Polimera 2 : దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు.. మా ఊరి పొలిమేర 2..